GDS applications: జీడీఎస్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం! 1 y ago
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. తపాల శాఖ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. మార్చి 3తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నియామకాలు పదో తరగతిలో సాధించిన మార్కులతో చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 1215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నవి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.